ఐపీఎల్ 16వ సీజన్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట్లో విరాట్ కోహ్లీని చూడగానే ఏమనిపించింది అని గేల్... డివిలియర్స్‌ను అడిగాడు. కోహ్లీని మొట్టమొదట చూడగానే అహంకారి అనిపించిందని డివిలియర్స్ బదులిచ్చాడు. అప్పట్లో కోహ్లీ పద్ధతులు తనకు నచ్చేవి కావని స్పష్టం చేశాడు. అయితే, కోహ్లీ ఆట తీరు చూశాక అభిప్రాయాన్ని మార్చుకున్నానని, అతడి ఆత్మవిశ్వాసం అద్భుతమని కొనియాడాడు. కోహ్లీలో ఉన్న మానవతా దృక్పథాన్ని దగ్గరగా గమనించిన తర్వాత అతడంటే గౌరవభావం ఏర్పడిందని డివిలియర్స్ తెలిపాడు.










