రాజమండ్రి : '' జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయి '' అని నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి మాట్లాడుతూ ... చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదన్నారు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారనీ, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఓవర్‌హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని, జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణి మాట్లాడుతూ ... జైలులో ఉన్న పరిస్థితులతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు ఉందని అన్నారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అవసరం అని, ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
.










