May 14,2023 21:16

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):ఇండియా-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సముద్ర శక్తి-23 విన్యాసాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. భారత నౌకా దళం తరపున స్వదేశీయంగా రూపొందిన ఐఎన్‌ఎస్‌ కవరత్తి ఈ విన్యాసాల్లో పాల్గనేందుకు ఇండోనేషియా తీరానికి చేరుకుంది. ఈ నౌకలో భారత నౌకాదళం డోర్నియర్‌ మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, చేతక్‌ హెలికాప్టర్‌ ఉన్నాయి. ఈ విన్యాసాల్లో ఇండోనేషియా నేవీకి చెందిన కెఆర్‌ఐ సుల్తాన్‌ ఇస్కందర్‌ ముడా, సిఎన్‌ - 235 మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎఎస్‌ - 565 పాంథర్‌ హెలీకాప్టర్‌ పాల్గననున్నాయి. సముద్ర శక్తి విన్యాసాలతో ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడనున్నాయని నేవీ అధికారులు తెలిపారు.