Jan 25,2023 20:41

హైదరాబాద్‌ : దేశంలో తొలిసారి మైలో బట్ట (క్లాత్‌) డైపర్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. వీటిలో శిశువు శరీరానికి హాని కలిగించే ఎటువంటి హానికర రసాయనాలు ఉండవని ఆ సంస్థ పేర్కొంది. వీటిని చాలా సులభంగా ఉతికి శుభ్రం చేసుకోవడం ద్వారా 300 కంటే ఎక్కువ సార్లు వాడుకోవచ్చని పేర్కొంది. 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు సరిగ్గా సరిపోతాయని, 17 కిలోల బరువున్న పిల్లలకు వరకు ఉపయోగించవచ్చని తెలిపింది. వీటి ధరను రూ.599గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.