ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్-3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఇలా చంద్రయాన్-3 కక్ష్య దూరం మరోమారు పెంచారు. అక్కడ నుంచి ఐదు రోజులపాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవత్తాకార కక్ష్యలో పరిభ్రమించి వంద కిలోమీటర్ల వత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఆ కక్ష్యలోకి వచ్చాక ఆగస్టు 23వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ విచ్చుకుని లోపలి నుంచి రోవర్ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని అందిస్తుంది.