అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పి.శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనలను అతిక్రమించి ఉన్నతాధికారులకు చెప్పకుండా శ్రీనివాస్ అమెరికాకు వెళ్లారనీ, ఆ కారణంగా ఆయన పరారీలో ఉన్నట్లు భావిస్తూ.. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సచివాలయంలోని ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కూడా శ్రీనివాస్‌ను సిఐడి నిందితుడిగా చేర్చింది.










