గుంటూరు: సీఎం జగన్ స్క్రిప్ట్ ప్రకారమే తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాక్షసంగా, అన్యాయంగా అరెస్టు చేశారని ఎన్టీఆర్ తనయుడు, నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడికొండలో టిడిపి నేతల రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రముఖలంతా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలంతా కలిసి పోరాటం చేయాలన్నారు. అక్రమ కేసుల నుంచి బయటపడి.. ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మళ్లీ సీఎంగా రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతారని రామకఅష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.










