హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ .... నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం హైదరాబాద్ నగరంలోని ఐటి ఉద్యోగులు కారు ర్యాలీ చేపట్టనున్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ నుంచి ఈ కారు ర్యాలీ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ సాగనుంది. విడతల వారీగా కారు ర్యాలీ చేపట్టాలని ఐటి ఉద్యోగులు నిర్ణయించారు. అయితే ఉద్యోగుల ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు.










