Sep 16,2023 10:57

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : షరీఫ్‌నగర్‌కు చెందిన సిపిఎం కార్యకర్త పి.వెంకటస్వామి శనివారం అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈయన 2002 సంవత్సరం నుంచి పార్టీకి క్రియాశీల కార్యకర్తగా ఉంటూ సేవలందిస్తూ వచ్చారు. దీనితోపాటు భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) నగర కమిటీలో సభ్యుడిగా కార్మిక రంగానికి సేవలందించారు. ప్రస్తుతం కెవిపిఎస్‌ నగర్‌ కమిటీ సభ్యుడిగా సామాజిక ఉద్యమంలో తన వంతు సేవలందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో కాలేయ సంబంధం వ్యాధితో వెంకటస్వామి బాధపడుతూ చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు శనివారం తెల్లవారుజామున సుమారు 6 గంటలకు పరిస్థితి విషమించి అకాల మరణం చెందారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె శ్రీలేఖ ఉన్నారు.