Oct 10,2023 12:14

తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భార్య కల్వకుంట్ల శోభ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానంతరం శ్రీకాళహస్తికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితుల మంత్రాలతో ఆశీస్సులు అందించారు. ఈ పర్యటనలో ఆమెతోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిలు ఉన్నారు.