నిడదవోలు (తూర్పు గోదావరి) : నాలుగో విడతలో భాగంగా ... '' వైఎస్సార్ కాపు నేస్తం '' నిధులను సిఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో విడుదల చేశారు. అర్హులైన 3,57,844 మంది లబ్దిదారులకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. శనివారం నిడదవోలులో సిఎం జగన్ పర్యటించారు. సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేశారు.
అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ ... అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అందరి ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కఅతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నామని తెలిపారు. వరుసగా ఐదేళ్లపాటు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని సిఎం తెలిపారు. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నామన్నారు. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరిందని, 45 నుంచి 60 ఏళ్ల అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచామని ముఖ్యమంత్రి తెలిపారు.
45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారని సిఎం జగన్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారని అన్నారు. సాక్ష్యాధారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారని చెప్పారు. బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులేనన్నారు. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు అని .. ఎల్లో మీడియా నిజాలను చూపించదు అని... ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు అని.. నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సఅష్టించారని సిఎం జగన్ ఆరోపించారు. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనన్నారు. ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. సీమెన్స్ కంపెనీ తమకు సంబంధం లేదని చెప్పిందని, ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని తెలిపారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారని అన్నారు. డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చిందని సిఎం అన్నారు. ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారని ఆరోపించారు. కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు అని, ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు అని చెప్పారు. చంద్రబాబు పీఏకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? అని సిఎం జగన్ ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? అని అడిగారు. వాటాలు పంచుతారు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు అని అన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకరని, ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకరని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఆలోచన చేయాలని సిఎం జగన్ కోరారు.










