Sep 28,2023 12:10

ప్రజాశక్తి-అమరావతి : ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహౌన్నత వ్యక్తి మహ్మద్‌ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు'' అంటూ సీఎం ట్వీట్‌ చేశారు.