Jun 19,2023 16:49

టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. వెన్నుగాయం కారణంగా గతేడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్‌ జస్పీత్‌ బుమ్రా తిరిగి టీమ్‌తో చేరనున్నట్తు తెలుస్తోంది. వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో పాల్గొనేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్‌ సెంటర్‌లో బుమ్రా సాధన చేస్తున్నాడు.
బుమ్రా రాకపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. 'బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకుని ఎన్సీఏలో ఫిట్నెస్‌ ను మెరుగుపరుచుకునే క్రమంలో ఉన్నాడు. అతడు త్వరలోనే ఐర్లాండ్‌ సిరీస్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. టీమిండియాకు ఇది బిగ్‌ బూస్ట్‌. అన్నీ కుదిరితే అతడు ఆసియా కప్‌ లో ఆడతాడు...'అని తెలిపాడు.