Sep 28,2022 20:29

హైదరాబాద్‌ : ఇరవై ఏళ్లుగా మొబైల్స్‌ రిటైల్‌ విక్రయాల్లో రాణిస్తున్న బిగ్‌సి ప్రస్తుత పండగ సీజన్‌లో భారీ ఆఫర్లను ప్రకటించింది. దసరా, దీపావళి వేడుకల సందర్బంగా తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన డబుల్‌ ధమాకా ఆఫర్లను అందిస్తోన్నట్లు బిగ్‌సి ఫౌండర్‌, సిఎండి యం బాలు చౌదరీ తెలిపారు. ప్రతీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలుపై రూ.1,999 విలువ గల ఇన్‌బేస్‌ ఇయర్‌ బడ్స్‌ కేవలం రూ.199కు లేదా రూ.3,999 విలువ గల జిజ్‌మోర్‌ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.899కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ స్మార్ట్‌ టివి కొనుగోలుపై రూ.11,499 విలువ గల ఫింగర్స్‌ బార్‌ స్పీకర్‌ ఊపర్స్‌తో పాటు రూ.3000 తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చన్నారు. ప్రతీ ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై రూ.3000 డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ను ఉచితంగా ఇస్తున్నామన్నారు. బ్రాండెడ్‌ అసెస్సరీస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్‌, ఎస్‌బిఐ కార్డు ద్వారా మొబైల్స్‌ కొనుగోలుపై 7.5 శాతం ఇన్స్‌టాంట్‌ రాయితీ కల్పిస్తున్నామన్నారు. ఐఫోన్‌, సామ్‌సంగ్‌, వన్‌ఫ్లస్‌, వివో, ఒప్పో మొబైళ్ళపై రూ.5వేల నుంచి 10వేల వరకు క్యాష్‌బ్యాక్‌, 10 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్లను అందుబాటులో ఉంచామన్నారు.