Jun 21,2023 14:55

ఇంగ్లాండ్‌ : యాషెస్‌ సిరీస్‌ 2023లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్‌ ఓటమిపై స్టోక్స్‌ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌ గెలిచిన కమిన్స్‌ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధ ఉన్నా.. బజ్‌బాల్‌ క్రికెట్‌ విషయంలో వెనక్కి తగ్గం అని తెలిపారు. దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాకు కఠిన సవాల్‌ విసురుతాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సరైనదిగానే భావిస్తామని అన్నాడు. ''సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్‌ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. మేం ఇంకా చాలా క్రికెట్‌ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్‌ అంతా వచ్చే మ్యాచ్‌లపైనే ఉంది' అని బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు జూన్‌ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్‌ వేదికగా జరగనుంది.