Mar 27,2023 21:16

చిట్టగాంగ్‌: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టి20లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టి20లో బంగ్లాదేశ్‌ జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిపై 22పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 19.2 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది. ఆ దశలో మ్యాచ్‌ వర్షం కారణంగా కొంతసేపు నిలిచింది. వర్షం నిలిచిన తర్వాత మ్యాచ్‌ ప్రారంభం కాగా.. ఐర్లాండ్‌ లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిపై 8 ఓవర్లలో 103పరుగులుగా నిర్దేశించగా.. ఐర్లాండ్‌ జట్టు 5వికెట్ల నష్టానికి 81పరుగులే చేయగల్గింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యతలో నిలువగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రూనీ తాలూక్దార్‌కు లభించింది.