- ఆస్ట్రేలియా 174, న్యూజిలాండ్ 76 ఆలౌట్
కేప్‌టౌన్ : మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును 76 పరుగులకే ఆలౌట్ చేసి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా 3 వికెట్లు, జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి 76 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు.










