హోరాహోరీ ఫైనల్లో రైబకినాపై గెలుపు
రేపు పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన 5వ సీడ్ అర్యానా సబలెంకా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో సబలెంకా 4-6, 6-3, 6-4తేడాతో 22వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన ఎలేనా రైబకినాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మూడుసెట్ల పోరులో అంతిమ విజేతగా సబలెంకా నిలిచింది. ఈ ఏడాదిలో సబలెంకా వరుసగా 11 మ్యాచుల్లో విజయాలతో టాప్‌సీడ్ ఇగా స్వైటెక్(బెలారస్) తర్వాత రెండో ర్యాంక్‌కు ఎగబాకనుంది. ఐదోసీడ్‌గా బరిలోకి దిగిన సబలెంకా తొలిసెట్‌ను ఓ దశలో 3ా1 ఆధిక్యతలో నిలిచినా.. రైబకినా ఆ తర్వాత పుంజుకోవడంతో 4ా4తో సమం చేసింది. ఆ తర్వాత రైబకినా ఆ సెట్‌ను చేజిక్కించుకోవడం విశేషం. దీంతో తేరుకున్న సబలెంకా ఆ తర్వాత రెండు, మూడు సెట్‌లలో భారీ సర్వీసులతో రైబకినాపై ఎదురుదాడికి దిగింది. రెండో సెట్‌లో 5ా3 ఆధిక్యతలోకి వచ్చి ఆ సెట్‌ను 6ా3తో ముగించింది. ఇక మూడో సెట్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ సాధించి ఆ సెట్‌ను 6ా4తో కైవసం చేసుకొని టైటిల్ విజేతగా నిలిచింది. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా 17 ఏస్‌లను సంధించడం విశేషం. సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు, ఆమె 2021లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకుంది. 2019 యుఎస్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.హొఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో సబలెంకా ప్రపంచ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి చేరనుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు భారత కరెన్సీలో సుమారు రూ.17.34కోట్లు లభించడంతోపాటు 2000 ఏటిపి పాయింట్లు కూడా లభించాయి. ఇక రన్నరప్‌గా నిలిచిన రైబకినాకు రూ.9.47కోట్ల రూపాయలతోపాటు 1300 ఏటిపి పాయింట్లు దక్కాయి.
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్..
నేడు 4వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్, 3వ సీడ్ గ్రీక్‌కు చెందిన సిట్సిపస్‌ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. జకోవిచ్ టైటిల్ గెలిస్తే రికార్డుస్థాయిలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సరసన చేరనున్నాడు.
సబలెంకా టైటిల్ గెలిచిందిలా..
ఫైనల్ : రైబకినా(5)పై 4-6, 6-3, 6-4
సెమీస్ : లినెట్టెపై 7-6(7-1), 6-2
క్వార్టర్స్ : వేకిక్ 6-3, 6-2
ప్రిక్వార్టర్స్ : బెన్సిక్(12)పై 7-5, 6-2
మూడోరౌండ్ : మెర్టెన్స్(26)పై 6-2, 6-3
రెండోరౌండ్ : రోజెర్స్‌పై 6-3, 6-1
తొలిరౌండ్ : మార్టిన్‌కోవా 6-1, 6-4










