- సెంచరీ దిశగా సాగుతున్న స్టీవ్ స్మిత్
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత లబుషేన్ అవుట్ కావడంతో 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కలిసి నాలుగో వికెట్‌కి 251 భాగస్వామ్యం జోడించి ఆదుకున్నారు. ట్రావిస్ హెడ్ 156 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 146 అందుకోగా, స్టీవ్ స్మిత్ 227 బంతుల్లో 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించాడు. 10 బంతులు ఆడిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో 4 ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ తర్వాత వస్తూనే లబుషేన్‌ని అవుట్ చేశాడు మహ్మద్ షమీ. 62 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
- టీ బ్రేక్ .. ఆసీస్ 170/3
ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి 51 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 60, స్టీవ్ స్మిత్ 33 పరుగులతో ఆడుతున్నారు.
- 50 ఓవర్లు పూర్తి
50 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 169 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 101 బంతుల్లో 33 పరుగులు , ట్రవిస్ హెడ్ 73 బంతుల్లో 59 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీ..
ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతుంది. హెడ్ 60 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 44 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 52, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో ఆడుతున్నారు.
A brilliant attacking innings from Travis Head 🔥
— ICC (@ICC) June 7, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/KwXitedrRY
- 100 పరుగుల మార్క్ దాటిన ఆసీస్
30 ఓవర్ల తరువాత ఆసీస్ 100 పరుగుల మార్క్‌ను దాటింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 12 , ట్రవిస్ హెడ్ 19 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతకు ముందు ఉస్మాన్ ఖ్వాజా పరుగులేమి చేయకుండా సిరాజ్ బౌలింగ్ పెవిలియన్‌కు చేరాగా, డేవిడ వార్నర్ 60 బంతుల్లో 43 పరుగులు చేసి శార్దుల్ ఠాకుల్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 26 పరుగులు చేసిన లబూషేన్ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు.
- 3వ వికెట్ డౌన్.. లబూషేన్ ఔట్
లంచ్ బ్రేక్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా 3 వికెట్‌ను కోల్పోయింది. 62 బంతుల్లో 26 పరుగులు చేసిన లబూషేన్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ , ట్రవిస్ హెడ్ ఉన్నారు.
Bowled him!
— BCCI (@BCCI) June 7, 2023
Shami strikes after Lunch and gets the wicket of Marnus Labuschagne.
He is bowled for 26 runs.
Live - https://t.co/5dxIJENCjB… #WTC23 pic.twitter.com/SuJv3msjWc
- లంచ్ బ్రేక్ .. ఆస్ట్రేలియా 73/2
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. తొలి వికెట్ ఉస్మాన్ ఖ్వాజా పరుగులేమి చేయకుండా సిరాజ్ బౌలింగ్ పెవిలియన్‌కు చేరాగా, డేవిడ వార్నర్ 60 బంతుల్లో 43 పరుగులు చేసి శార్దుల్ ఠాకుల్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో వైపు లబూషేన్ 61 బంతుల్లో 26 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టీవ్ స్మిత్ 7బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- వార్నర్ ఔట్.. ఆస్ట్రేలియా 71/2
60 బంతుల్లో 43 పరుగులు చేసిన డేవిడ వార్నర్ శార్దుల్ ఠాకుల్ బౌలింగ్‌లో కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 71 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. లబూషేన్ 60 బంతుల్లో 26 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
Shardul Thakur gets the breakthrough!
— BCCI (@BCCI) June 7, 2023
A sharp catch by KS Bharat as David Warner departs for 43 runs.
Live - https://t.co/0nYl21oYkY… #WTC23 pic.twitter.com/jIJDwxM6Zh
- 20 ఓవర్లు పూర్తి.. ఆస్ట్రేలియా 62/1
20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 62 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ.. స్కోరు బోర్డును పెంచుతున్నారు. కాగా డేవిడ్ వార్నర్ 54 బంతుల్లో 39 పరుగులు, మార్నస్ లబూషేన్ 56 బంతుల్లో 22 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి.. ఆస్ట్రేలియా 54/1
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్44 బంతుల్లో 37 పరుగులు, మార్నస్ లబూషేన్ 36 బంతుల్లో 16 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 10 ఓవర్లు పూర్తి
10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 22 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 13 పరుగులు, మార్నస్ లబూషేన్ 25 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మరో వైపు భారత ఆటగాళ్లు వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- 7 ఓవర్లకు .. ఆస్ట్రేలియా 18/1
7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 13 పరుగులు, మార్నస్ లబూషేన్ 10 బంతుల్లో 4 పరుగులు చేశాడు.
- ఉస్మాన్ ఖ్వాజా ఔట్.. ఆస్ట్రేలియా 2/1
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కొల్పోయింది. సిరాజ్ వేసిని నాల్గోవ ఓవర్‌లో ఉస్మాన్ ఖ్వాజా శిఖర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజులోకి మార్నస్ లబూషేన్ వచ్చాడు.
Edged & taken! 👌 👌
— BCCI (@BCCI) June 7, 2023
Early success with the ball for #TeamIndia, courtesy @mdsirajofficial 👏 👏
Australia lose Usman Khawaja!
Follow the match ▶️ https://t.co/0nYl21pwaw #WTC23 pic.twitter.com/3v73BKFQgD
- తొలి రెండు ఓవర్లు మెడిన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో టాస్ ఓడి ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. కాగా షమీ వేసిన తొలి ఓవర్‌ను వార్నర్ ఆడగా పరుగులేమి చేయలేదు. సిరాజ్ వేసిన 2వ ఓవర్‌లో ఉస్మాన్ ఖ్వాజా పరుగులు చేయలేదు.
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌కీపర్‌గా కేఎస్ భరత్‌ను రోహిత్ ఎంపిక చేశాడు.
🚨 Toss Update 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Australia in the #WTC23 Final
— BCCI (@BCCI) June 7, 2023
Follow the match ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/Kcn0xWDGrT
తుది జట్లు..
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్










