డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. కామెరున్‌గ్రీన్ 20, అలెక్స్ క్యారీ 11 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 147/5 పరుగులు చేసింది. 320 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.
- లబుషేన్‌ను ఔట్
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట మొదలైంది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ 41 పరుగులు చేసిన లబుషేన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 297 పరుగుల ఆధిక్యంలో ఉంది.










