ప్రజాశక్తి - వీరులపాడు (ఎన్టీఆర్ జిల్లా) : వీరులపాడు మండలంలోని జయంతి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ నామాల ఎల్లమందమ్మ శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్లమంద మృతికి ఆశ వర్కర్స్ యూనియన్, సిఐటియు మండల కమిటీ సంతాపం తెలియజేశారు.










