న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ జులై 15, 16 తేదిల్లో అమెజాన్ ఫ్రైమ్ డే సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఎంపిక చేసిన ఉత్పత్తులను అదే రోజు డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. 45,000 పైగా కొత్త ఉత్పత్తులు, 400 టాప్ ఇండియన్, గ్లోబల్ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. చిన్న, మధ్య తరహ వ్యాపారులు కొత్తగా తమ 2వేల పైగా ఉత్పత్తులను అమ్మకానికి పెట్టనున్నారని తెలిపింది. ఎంపిక చేసిన కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్, అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించనున్నట్లు వెల్లడించింది.










