షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్'పై అల్లు అర్జున్ పొగడ్తలు కురిపించారు. 'మీ కెరీర్‌లోనే ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. మీ స్టైల్‌తో భారతదేశం మొత్తాన్ని ఊర్రూతలూగించారు. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ సేతుపతి ఎప్పటిలానే తన అద్భుతమైన నటనతో అదరగొట్టారు. దీపికా పదుకొణె, నయనతార వారి అందంతో మెరిశారు. అనిరుధ్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను మైమరపించారు. ప్రత్యేకించి దర్శకుడు అట్లీకి పెద్ద కంగ్రాట్స్. ఇలాంటి కమర్షియల్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.










