Mar 15,2023 21:38
  • ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

లండన్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు తొలిరౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సింధు 17-21, 11-21తో చైనాకు చెందిన వై మింగ్‌ జంగ్‌ చేతిలో ఓడింది. తొలిగేమ్‌లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక మహిళల డబుల్స్‌లో త్రీషా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జోడీ రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. తొలిరౌండ్‌లో త్రీషా-గాయత్రి జోడీ 21-18, 21-14తో థారులాండ్‌కు చెందిన ప్రజోగల్‌-కితిహరత్కూర్‌పై వరుససెట్లలో గెలిచారు.