Jul 14,2023 21:18

న్యూఢిల్లీ : భారత్‌లోని తమ కస్టమర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ హెడ్‌గా అజయ్ స్పూర్తిని నియమించినట్లు ఎయిర్‌కాప్ట్స్‌ ఇంజిన్ల తయారీదారు ప్రాట్‌ అండ్‌ విట్నీ తెలిపింది. పౌర విమానయాన పరిశ్రమలో అజరుకు 27 ఏళ్ల పైనా అనుభవం ఉంది. ఆయన తన కెరీర్‌ విస్తరించే సమయంలో వివిధ ఎయిర్‌లైన్స్‌తో, ఒరిజినల్‌ ఎక్విప్‌ మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఒఇఎంలు)తో పని చేశారు. ఆయన తన కొత్త బాధ్యతలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రాట్‌ అండ్‌ విట్నీ ఐసిటిసికి బాధ్యతవహిస్తారని ఆ సంస్థ పేర్కొంది.