Oct 29,2022 20:25

ప్రజాశక్తి - పలాస (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వంకల దానమ్మ (50) కిడ్నీ వ్యాధితో శనివారం మృతి చెందారు. మామిడిపల్లికి చెందిన దానమ్మ వివాహం కాకపోవడంతో తన ఇద్దరి అన్నయ్యల వద్ద ఉంటున్నారు. ఆమె బాగోగులను వారే చూసుకుంటున్నారు. ఒంటరి మహిళ పింఛను కూడా వస్తోంది. మూడేళ్ల క్రితం ఆమె కిడ్నీ వ్యాధి బారిన పడడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయాసంగా ఉండడంతో ఆమె సోదరుడు కాశీబుగ్గలోని ఓ ఆస్పత్రిలో చూపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఇంటికి తీసుకెళ్లిపోమని చెప్పారు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి దానమ్మ మృతిచెందారు.