నిరసన వ్యక్తం చేస్తున్న 104 ఉద్యోగులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు చేపట్టిన నిరసనలు శనివారానికి 7వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 104 ఉద్యోగులు తమ విధుల్లో భాగంగా భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, మానస తదితరులు హాజరై మాట్లాడుతూ 104ను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలన్నారు. 104 ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్ ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బఫర్ ఉద్యోగులకు బకాయి ట్రావెలింగ్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని, బదిలీల సౌకర్యం కల్పించాలని కోరారు. మూడు నెలలకు ఒకసారి ఉద్యోగులు యాజమాన్య ప్రతినిధులతో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించాలన్నారు.










