బెంగళూరు : దేశీయ ఇవి స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ రూ.40 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపింది. దీంతో ప్రీ సిరిస్ ఎ రౌండ్‌లో ఇప్పటి వరకు రూ.72 కోట్ల ఈక్విటీ, రుణాల రూపంలో మూలధనం సమకూర్చుకున్నట్లయ్యిందని పేర్కొంది. సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.88 కోట్లు సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. బెంగళూరులోని తమ తయారీని ఏడాదికి లక్ష యూనిట్లకు చేర్చుకోవాలనే లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని ఒబెన్ ఎలక్ట్రిక్ ఫౌండర్, సిఇఒ మధుమితి అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.










