Apr 30,2023 21:30

29 మంది కంటి రోగులకు ఆపరేషన్లు

రాయచోటి : మండల పరిధిలోని చెన్నముక్కపల్లిలో గల లయన్స్‌ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 29 మందికి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు జిల్లా పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, పెద్దమండెం, యర్రావారిపాలెం, కేవీ పల్లి, కదిరి, ఎన్‌.పి. కుంట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అర్హులైన 29 మంది కంటి రోగులకు ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్‌ చేయించుకున్న 34 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ కంటి ఆసుపత్రి చైర్మన్‌ వైవిఆర్‌ స్వరూప్‌ గుప్తా, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌ బాష కంటి వైద్యులు సురేష్‌ బాబు, భార్గవి ,మహాలక్ష్మి, ఆప్త్మాలిక్‌ అసిస్టెంట్‌ మూలి రాజగోపాల్‌ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు