అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86,280 పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో 19 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,46,749 మంది వైరస్ బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,197కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,09,613కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,38,636 నమూనాలను పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.










