Aug 24,2022 12:33

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : గురుకులాలకు 18మంది విద్యార్థులు ఎంపికయినట్లు సిహెచ్‌.విజయ్ కుమార్‌ తెలిపారు. బుధవారం ఫ్రెండ్‌ సర్వీసెస్‌'' సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు చాట్ల విజయకుమార్‌ మాట్లాడుతూ ... రెడ్డిగూడెం ''ఫ్రెండ్‌ సర్వీస్‌ సొసైటీ ఆఫ్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌'' ద్వారా ఉచితంగా శిక్షణ పొంది డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలకు 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 25 మంది విద్యార్థులు హాజరై ఉత్తీర్ణులయ్యారని, వారిలో తాజాగా ముగిసిన అడ్మిషన్లు ప్రక్రియ వరకు 18 మంది విద్యార్థులు తాము కోరుకున్న పాఠశాలలో ప్రవేశం పొందినట్లు'' చాట్ల విజయకుమార్‌ తెలిపారు. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా తమ వద్ద ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తాము కోరుకున్న పాఠశాలలో ప్రవేశం పొందారని చెప్పారు. ప్రవేశం పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.