ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ వార్నర్ (6) అనుకోకుండా ఔటయ్యాడు. బెయిర్‌స్టో ఆడిన బంతికి ఉమేశ్ చేతిని అడ్డుపెట్టడంతో అది వికెట్లను తాకింది. అప్పటికే క్రీజులో బైట ఉన్న వార్నర్ రనౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో హైదరాబాద్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అంతకుముందు బెయిర్‌స్టో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో పాటు రెండు వైడ్లు రావడంతో ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు లభించాయి. డేల్ స్టెయిన్ వేసిన మూడో ఓవర్‌లో మనీష్ పాండే ఫోర్ కొట్టడంతో పాటు సింగిల్, డబుల్ రన్స్ వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ స్కోరు 25/1గా నమోదైంది. నవదీప్ షైనీ వేసిన నాలుగో ఓవర్‌లో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. ఉమేశ్ యాదవ్ వేసిన ఐదో ఓవర్‌లో మనీష్ పాండే రెండు ఫోర్లు బాదాడు. మరో రెండు సింగిల్స్ రావడంతో ఆ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. నవదీప్ షైనీ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతిని బెయిర్‌స్టో ఫోర్‌గా మలచాడు. మరో నాలుగు సింగిల్స్‌తో మొత్తం ఆ ఓవర్‌లో 8 పరుగులు రాబట్టారు. పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ స్కోరు 48/1గా నమోదైంది. ఆర్‌సిబి పవర్‌ప్లేలో 53/0 పరుగులు రాబట్టింది. ప్రస్తుతం బెయిర్‌స్టో, మనీష్ పాండే క్రీజులో ఉన్నారు.










