Jan 25,2023 20:37

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 77 శాతం వృద్థితో రూ.1,247 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 27 శాతం పెరిగి రూ.6,770 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.706.5 కోట్ల లాభాలు, రూ.5319.7 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. కంపెనీ వృద్థికి అమెరికా, రష్యా మార్కెట్ల నుంచి బలమైన మద్దతు లభించిందని ఆ కంపెనీ కో ఛైర్మన్‌, ఎండి జివి ప్రసాద్‌ పేర్కొన్నారు. గ్లోబల్‌గా తమ మరిన్ని పేటెంట్లను తీసుకురావడం ద్వారా మరింత బలోపేతాన్ని కొనసాగిస్తామన్నారు.