Aug 10,2023 16:13

ప్రజాశక్తి- చాగల్లు(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన చాగల్లు ఎంపీపీ అశోక్‌ నగర్‌, చాగల్లు పాఠశాలలో యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా యూటీఫ్‌ జెండాను ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యుటిఎఫ్‌ ఆవిర్భవించి 50 సంవత్సరాలు అయిందని అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ఉండే సంఘముగా యుటిఎఫ్‌ ముందు ఉంటుందన్నారు ఎంతోమంది సీనియర్‌ కార్యకర్తలు త్యాగాలు చేసి సంఘ అభ్యున్నతికి పాటు పడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి.వికుమార్‌, పిల్లి శ్రీనివాసమూర్తి, జె.రాజశేఖర్‌, టి.నారాయణరావు, ఎస్‌కె.కరీం, జి.శ్రీ హరి, పి.రవివర్మ, పి.వి.నాగేశ్వరావు, ఎమ్‌.జి.ఎమ్‌ షరీఫ్‌, వై.నాగరాజు, ఎస్‌.రాజేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.