Jul 19,2023 10:27

ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : మార్కెట్‌లో అంతలా టమోటా ధరలు భారీగా పెరిగాయి.. సామాన్యులకు ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్నీ కూరగాయలు అలానే ఉన్నాయి.. అందుకే జనాలు ఇప్పుడు చికెన్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఇలాంటి తరుణంలో ఓ దుకాణం అతను అదిరిపోయే బంఫర్‌ ఆఫర్‌ ను ప్రకటించారు. అదేంటంటే.. ఒక కేజీ చికెన్‌ కొంటే కొనుగోలు చేస్తే అరకేజీ టమాటాలు ఉచితంగా అందిస్తున్నాడు. దీనికి జనాల్లో మంచి స్పందన వస్తుంది.. వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని చివటం గ్రామంలో శ్రీ గణేష్‌ చికెన్‌ దుకాణదారుడు వనం శ్రీను తన షాపు వద్ద ఒక కేజీ చికెన్‌ కొంటే కొనుగోలు చేస్తే అరకేజీ టమాటాలు ఉచితంగా అందిస్తున్నాడు. కారణం దుకాణదారుడిని ప్రశ్నించగా తన వ్యాపార అభివృద్ధి కోసం, ప్రచారం కోసం గత మూడు వారాలుగా ఆదివారం ఉల్లిపాయలు, బుధవారంరోజు టమోటాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపాడు. అలాగని మార్కెట్లో ఉన్న చికెన్‌ ధర కంటే ఎక్కువగా అమ్మడం లేదని తెలిపారు. కేజీ చికెన్‌ కొంటే కొనుగోలు చేస్తే అరకేజీ టమాటాలు ఉచితంగా ఇస్తుండటంతో తన షాపులో అమ్మకాలు పెరిగాయని చెప్పుకొచ్చాడు.