గ్రామీణా ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లుకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు
ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : మండలం తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు కు డిమాండ్ల తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు మాట్లాడుతూ .... ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు మాన్ డేస్ టార్గెట్ విధానము రద్దు చేసి అందరికీ ఎఫ్‌టిసి అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామీణ ఉపాధి పథకంలో గత 17 సంవత్సరాలు గా ఫీల్డ్ అసిస్టెంట్లు గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధి హామీ కూలీల కు ఉపాధి పని దినాలు కల్పిస్తూ దేశంలోని రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఫీల్డ్ అసిస్టెంట్స్ డిమాండ్స్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎం ఎం ఎస్ మ్యాప్ వద్ద వస్తున్న సాంకేతిక సమస్యలు మూలంగా ఉపాధి పనులకు కూలీలు హాజరు పని జరుగు ప్రదేశం ఫోటో అప్లోడ్ అవ్వక ఉపాధి కూలీల హాజరు శాతం సాంకేతిక సమస్య వల్ల తగ్గిపోతున్నదని, ఫీల్డ్ అసిస్టెంట్స్ మ్యాన్ డేస్ రీచ్ అవ్వలేక డి.గ్రేట్ అవుతున్నారు అని, మ్యాండిస్ టార్గెట్ విధానం రద్దు చేయాలన్నారు. సీనియర్ మేట్ ఫీల్డ్ అసిస్టెంట్ భేదం లేకుండా అందరినీ ఫీల్డ్ అసిస్టెంట్ గా కొనసాగించాలన్నారు. పిక్స్‌టైమ్స్ ఉద్యోగులుగా వీరిని గుర్తించాలన్నారు. అర్హత అనుభవం కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలన్నారు. కాస్ట్ లెస్ హెల్త్ కార్డులు సదుపాయం అందరికీ కల్పించాలని వారు సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.నరేష్, దొంగ సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబురావు, వరాంబాబు, గణపతి, శ్రీనివాస్, పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.










