ప్రజాశక్తి - సీతానగరం (తూర్పు గోదావరి) : బావిలో పడిన వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం ఉదయం బయటకు తీసిన ఘటన మిర్తిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. మిర్తిపాడు గ్రామంలో 10వ తేదీన ఓ వ్యక్తి బావిలో దూకాడు. అతడి మృతదేహాన్ని ఆదివారం గుర్తించి బయటకు తీశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు రాజానగరం మండలం తొర్రేడు గ్రామానికి చెందిన పల్లి జాన్ (23) గా గుర్తించారు. మృతదేహం శరీరంపై టీ షర్టు, లోదుస్తులు ఉన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వ్యక్తి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సీతానగరం ఎస్‌ఐ శుభ శేఖర్, సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










