Jul 09,2023 12:10

లక్కనపల్లి (చిత్తూరు) : లక్కనపల్లి గ్రామ సమీపాన వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించిన ఘటన ఆదివారం జరిగింది. గమనించిన స్థానికులంతా కలిసి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.