Sep 24,2023 10:54

ప్రజాశక్తి - రాజమండ్రి : ధవలేశ్వరంలోని ఇరిగేషన్‌ విద్యుత్‌ శాఖకు చెందిన విద్యుత్‌ తీగలు జి.టి.పి.ఎస్‌ క్వార్టర్స్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద విద్యుత్‌ సరఫరా అయ్యే వైర్లకు పిచ్చి మొక్కలు తీగలు అల్లుకుపోవడంతో దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ వార్త ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమవడంతో వెంటనే బ్యారేజ్‌ విద్యుత్‌ శాఖ స్పందించి వెంటనే తన సిబ్బందిని పంపించి విద్యుత్‌ వైర్లకు ఉన్న పిచ్చి మొక్కలు తీగలను తొలగించారు.