Jun 09,2023 10:12

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కుల్లాయిస్వామి వెలిసిన గుగుడు గ్రామంలో వర్షానికి ప్రధాన రహదారిలో వర్షపునీరు మోకాళ్ల లోతు వరకు నిలిచి భక్తులు, గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజాశక్తిలో కథనం ప్రచురితం కావడంతో .... సమస్యను తెలుసుకున్న గంటల వ్యవధిలోనే నార్పల ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి వెంటనే స్పందించి తన సిబ్బందితో కలిసి గూగూడు గ్రామానికి శుక్రవారం వెళ్లారు. జెసిపితో రోడ్డు పక్కనే చిన్న కాలువను ఏర్పాటు చేసి కుళ్లాయి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఎస్సై చొరవ పట్ల గుగుడు గ్రామస్తులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.