Oct 14,2023 08:21

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గడువు ముగిసిన తర్వాత బదిలీలైన ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజరుజైన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జిఓ ఎంఎస్‌ నెంబరు 6ను విడుదల చేసింది. సబ్‌ ట్రెజరీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వేతనాలు చెల్లింపులు నిలిచిపోయిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ విడుదల చేసిన జిఓలో10.06.2023 నుంచి 31.07.2023 వరకు బదిలీలైన ఉద్యోగులకు సంబంధించి రాటిఫికేషన్‌ ఇస్తూ రాష్ట్ర ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, డైరెక్టరుకు ఉత్తర్వులిచ్చారు. 'బదిలీలు సరే.. రిలీవింగ్‌ ఎప్పుడు?' పలు ప్రాంతాల్లో ఉత్తర్వులివ్వని కలెక్టర్లు, బదిలీపై వెళ్లినా.. 3 నెలలుగా అందని వేతనాలు' అనే శీర్షికతో ఈ నెల 7న 'ప్రజాశక్తి'లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులను, బదిలీల గడువు దాటిన తర్వాత రిలీవైన వారికి మూడు నెలలుగా వేతనాలు అందని వైనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.