సింగరాయకొండ (ప్రకాశం) : సింగరాయకొండ మండలం బింగినపల్లి చెరువు ఆక్రమణలపై ప్రజాశక్తి ఇచ్చిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. ప్రజాశక్తి లో వచ్చిన వార్తపై శనివారం ఉదయం రెవిన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించి, జెసిబి తో ఆక్రమణ తొలగించే పనిలో ఉన్నారు. చెరువుల కల్వర్టు కు సంబంధించిన పైపులను తొలగించారు.










