సింగరాయకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా సింగరాయకొండకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31 నాటికి 2034 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి హైకోర్టు దఅష్టికి తెచ్చారని, దీని దృష్ట్యా కోర్టు మంజూరుకు చర్యలు తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి 19 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక జూనియర్ సివిల్ జడ్జి, ఒక సూపరింటెండెంట్, గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్ ఒకరు , ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక ఎగ్జామినర్, ఒక కాపీయిస్ట్, ముగ్గురు ప్రాసెస్ సర్వర్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్లు, మరొకరు మసాల్చి పోస్టులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.










