సింగరాయకొండ (ప్రకాశం) : అనపర్తిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సభలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ... సింగరాయకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కందుకూరు రోడ్డు నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొండపిశాసన సభ్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య, తదితరులు హాజరయ్యారు.










