ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు, లారీ ఢీకొన్న ఘటన శనివారం ధవళేశ్వరంలో చోటుచేసుకుంది. ధవళేశ్వరంలోని స్ధానిక సాయిబాబా మందిరం వద్ద ఆర్‌టిసి బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










