Sep 09,2023 09:29

ప్రజాశక్తి-విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులు నిలిచిపోయాయి. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖలో సిటీ సర్వీసులు, కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
 

mangalagiri

 

hindupuram

హిందూపురంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

bus

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో హిందూపురం డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టిసి సర్వీసులను అధికారులు ఆపివేయడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి