Jul 15,2023 12:48

కాపవరం (తూర్పు గోదావరి) : 108 వాహనాన్ని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో పేషెంట్‌ మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి కాపవరం సమీపంలో జరిగింది. గోపాలపురం 108 వాహనాన్ని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఈఎంటి, పైలెట్‌లకు గాయాలయ్యాయి. 108 వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో పేషెంట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈఎంటి, పైలెట్‌లను రాజమండ్రి సాయి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.