ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : తాము ఎలాంటి నిరసనకు, సిఎం కార్యాలయ ముట్టడికి పిలుపు ఇవ్వకపోయినా.. తమను ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నుండే పోలీసులు రైతు సంఘం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, రైతు సంఘం మండల నాయకులు కంకటాల బుద్ధుడులను పోలీసులు గఅహనిర్బంధం చేశారు.హొతమ సంఘం సిఎం కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదని చెబుతున్నా, వినిపించుకోకుండా పోలీసులు గఅహనిర్బంధం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జిల్లాలో రైతాంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, తడిసిన మొక్కజన్న, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా రైతుల గొంతు నొక్కి రైతు ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం అన్యాయమని విమర్శించారు. పోలీసు బెదిరింపులతో రైతు ఉద్యమాలు మరింత ఉధఅతం అవుతాయని చెప్పారు. తమ సంఘం పిలుపు ఇవ్వకుండానే నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రైతు ఉద్యమ నాయకులను పోలీసులు ఇబ్బందులు గురి చేయడం తగదన్నారు. ఇప్పటికైనా జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముందస్తు అరెస్టులు, పోలీసు నిర్బంధాల వలన ప్రజల్లో చైతన్యం కలిగి వారికి ప్రభుత్వాలపై మరింత వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. తడిసిన ధాన్యం, మొక్కజన్న పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. నష్టపోయిన కౌలు రైతులకే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.










