ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండలంలోని మురమండ గ్రామం చింతాలమ్మ పుంత రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో, గ్రామానికి చెందిన పండూరి అప్పారావు, దేవుడమ్మ దంపతుల పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యింది. వృద్ధ దంపతులు నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో కట్టుబట్టలు, ప్రాణాలతో బయటపడ్డ నిరాశ్రయులైన బాధితులు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, దాతలు బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.










