ప్రజాశక్తి-బిక్కవోలు (తూర్పుగోదావరి) : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొంకుదురు గ్రామంలో జిల్లా ప్రజాపరిషత్ వారు అందజేసిన స్టడీ మెటీరియల్‌ను బిక్కవోలు జెడ్పిటిసి రొంగల పద్మావతి అప్పాజీ పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. అంతక ముందు ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు జిల్లా ప్రజాపరిషత్ వారిచే ఉచితంగా పంపిణీ చేయబడిన ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తి వీరమనీ రాజా,వైస్ ప్రెసిడెంట్ తాతారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పీ వీ, పేరెంట్స్ కమిటీ చైర్ పర్సన్ కె. శ్రీలక్ష్మి, విద్యావేత్త డి.ఎస్.ఎన్. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










